టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి :మంత్రి బండి సంజయ్

  • తపస్ క్యాలెండర్ ఆవిష్కరణలో బండి సంజయ్ 

హైదరాబాద్, వెలుగు: రాబోయే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(టీపీయూఎస్) క్యాలెండర్​ను రిలీజ్ చేసి, మాట్లాడారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొదించాలని టీచర్లను కోరారు. భారతీయ సంస్కృతి విలువలను కాపాడటం కోసం తపస్ కృషి చేస్తోందని కొనియాడారు. దీనికి నిదర్శనమే క్యాలెండర్‌‌‌‌పై ‘పంచ పరివర్తన’ ప్రింట్ చేయడమేనని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంతరావు, నవాత్ సురేశ్‌‌, ఏబీఆర్ఎస్​ఎం నేత విష్ణువర్ధన్ రెడ్డి, తపస్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య, రాష్ట్ర నేతలు భాస్కర్, నవీన్, శివ, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.